నేటి ఆధునిక పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు అని అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ ..ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది .అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2011లో జరిగిన కడప ఉపఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సదరు మాజీ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన చూపు వైసీపీ పై పడింది .అందుకే ఈ ఏడాది నూతన సంవత్సరం ప్రారంభం సందర్బంగా స్థానిక వైసీపీ నేతలతో పాటుగా ఆయన అనుచరవర్గం వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ ఫోటోలు పెట్టి మరి స్వాగతాలు చెబుతూ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు .
అంతే కాకుండా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటుంటారు. కడప జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని వెలగబెట్టిన టీడీపీ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి హామీలను కేంద్రం చేత అమలుచేయించడంలో విఫలం కావడమే కాకుండా ఏకంగా గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కి దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని ఇరవై యేండ్లు వెనక్కి నెట్టింది .
ప్రస్తుత తరుణంలో రాష్ట్రాభివృద్ధి జరగాలన్న ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు ప్రజలందరికీ చేరాలన్న జగన్ ముఖ్యమంత్రి కావడం ..వైసీపీ అధికారంలోకి రావడం ..అందుకు తనలాంటి సీనియర్ నేతల అనుభవం చాలా అవసరం ఉండటంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అని తన అనుచవర్గం దగ్గర చెప్పారు డీఎల్ ..అయితే త్వరలో వైజాగ్ లో పాదయాత్ర మొదలు కానున్న నేపథ్యంలో అప్పుడు మంచి ముహూర్తం చూసుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడానికి డీఎల్ రెడీ అయ్యారు .అయిన ప్రస్తుత పరిస్థితుల్లో కనుచూపు మేర కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోవడం ..ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం ఖాయమనే వార్తలు వస్తున్నా నేపథ్యంలో డీఎల్ నిర్ణయాన్ని ఆయన అనుచవర్గం ఆమోదించారు అంట ..