సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్మిత్‌లను ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా ఆస్ర్టేలియా క్రికెట్ బోర్డు నిషేధం విధించిన విషయం. దీంతో వారిద్దరూ ఐపీఎల్ – 2018 సీజన్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. ఆ తరువాత కొందరు మాజీ క్రికెటర్లు వార్నర్, స్మిత్‌లపై విమర్శల వర్షం కురిపించగా.. మరికొందరు మాత్రం సానుభూతి చూపారు.
see also : మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!!
ఇదిలా ఉండగా.. ఏడాదిపాటు క్రికెట్ పరంగా నిషేధం ఎదుర్కొన్న వార్నర్ ఇప్పుడు కూలీ అవతారమెత్తాడు. ఎలాగో ఏడాదిపాటు తనకు, క్రికెట్‌కు గ్యాప్ రావడంతో.. ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు ఓ వైపు ఇంటిని నిర్మిస్తూనే.. మరో వైపు దుబాయ్‌లో క్రికెట్ అకాడమీని పెట్టే యోచనలో ఉన్నాడు ఈ నిషేధిత స్టార్ క్రికెటర్. అయితే, వార్నర్ తన ఇంటి నిర్మాణంలో భాగంగా టాప్ రూఫ్ కట్, అలాగే, రాళ్లను డ్రిల్ చేస్తూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.