అవును, కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ చేస్తా, నిరుద్యోగ భృతి, ఇలా చాలా హామీలతో ప్రజలను మభ్యపెట్టి.. కనక వర్షం కురిపించి 2014లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
see also : త్వరలో ఆ ఇద్దరు మంత్రుల అరెస్ట్..! వాస్తవ కథనం మీకోసం..!!
అంతే కాకుండా, చంద్రబాబు తన ఫార్ములాను భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలోనూ రిపీట్ చేశారు. 2014 ఎన్నికల్లో చేసిన హామీలకు మించిన వాగ్ధానాలను నంద్యాల ప్రజలకు సీఎం చంద్రబాబు చేశారు. నంద్యాల నుంచి కరువును దూరం చేయడంతోపాటు పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా, నంద్యాల నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనూ రోడ్లు వేయిస్తానని చెప్పారు. అయితే, నంద్యాల పరిధిలోని 80 గ్రామాల ప్రజల ప్రతీ రోజూ నిత్యావసర వస్తువుల కోసం పట్టణ ప్రాంతానికి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో తరచూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పనులు చేపడతామని చెప్పడంతో ప్రజలు న్మారు. రోడ్ల విస్తరణలో భాగంగా స్థలం కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం కూడా భారీగానే చెల్లించేందుకు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ఇచ్చిన హామీలే .. ఇప్పుడు ప్రజలకు తీవ్ర ఆవేదనను మిగుల్చుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక జరిగి ఏడాది గడిచినా.. ఇప్పటికీ రోడ్ల విస్తరణ పనులు నిర్వహించకపోవడం బాధాకరమంటున్నారు నంద్యాల ప్రజలు.
see also : పవన్-శ్రీరెడ్డి వివాదంపై బ్రహ్మానందం మాటల్లో ..!
నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తరువాత మంత్రులు నారాయణ, అఖిలప్రియ నియోజకవర్గంలో పర్యటించి.. రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని, స్థలాలు కోల్పోయిన వారికి మున్సిపల్ కాంప్లెక్స్‌లు నిర్మించి అందులో షాప్‌లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, నంద్యాల ఉప ఎన్నిక జరిగి పది నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ రోడ్ల విస్తరణ పనులు జరగకపోవడంతో చంద్రబాబు సర్కార్‌పై నంద్యాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు తమ ఓటు పవరేంటో చూపిస్తామని బాహాటంగా విమర్శలు చేస్తున్నారు నంద్యాల ప్రజలు.