ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. ఇలా ప్రజల్లో ఆదరణ పొందుతూ.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్‌లో వచ్చిన రాజకీయ పరిణితిని గమనించిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
see also : 2019లో నిన్నూ, నీ తల్లిని, నీ చెల్లిని ఓడిస్తాం..!!
see also : వైసీపీ సర్పంచ్‌పై మారణాయుధాలతో హత్యాయత్నం..!!
ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసిన పలువురు సీనియర్ నాయకులతోపాటు, టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇటీవల మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాయమాటలు చెప్పి తనను టీడీపీలోకి ఆహ్వానించారని, వారి మాటలు నమ్మి అన్ని విధాలా మోసపోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌పై ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు వైసీపీలో చేరుతుండటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.