ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా స్వాలమ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ నారా చంద్రబాబు డబ్బుకు ఆశపడి టీడీపీలో చేరారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.
see also : వైసీపీలోకి మరో సీనియర్ నేత..! డేట్ ఫిక్స్..!!
అయితే, ఓ పక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూస్తుంటే.. మరో పక్క చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల్లో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఏం చేయాలో తెలీక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దిక్కుతచడం లేదు. ఇప్పటికే వారిపై ఫిరాయింపు అనే బ్రాండ్ పడిన మాట వాస్తవం. ఇంటింటికీ టీడీపీ, ప్రజలతో ఎమ్మెల్యే వంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండాలంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల మధ్యకు వెళ్లిన నేతలకు చీవాట్లు తప్పడం లేదు.
see also : భారతినైనా కాపాడుకో..! జగన్‌పై ఎమ్మెల్యే వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..!!
మొన్నటికి మొన్న.. కదిరి ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ ఛాంద్‌భాషా.. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వెళ్తే.. ప్రజల నుంచి చుక్కెదురైంది. అసలు నీవు ఏ పార్టీ గుర్తుపై గెలిచావు. ఇప్పుడు ఏ పార్టీలో ఉండావంటూ.. ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేగాక. స్థానియ టీడీపీ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడిగుడ్లతో దాడికూడా చేశారు.
ఇకపోతే.. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పరిస్థితి కూదా ఇంతే. అక్కడ కూడా వ్యతిరేకత ఏర్పడింది. ఏకంగా ఎమ్మెల్యేపై చేయి చేసుకునే వరకు వచ్చింది. గ్రామస్థుల వ్యతిరేకతతో అక్కడ్నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నుంచి వెనుదిరిగారు ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి. దీంతో ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రజలు ఎదురుదాడి చేయడంతో తమకు భద్రత కల్పించాలంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు.