తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు .
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చింది దానికి కారణం ఈ గులాబీ జెండా ..పదిహేడు ఏళ్ళ కిందట పుట్టిన ఈ జెండా పద్నాలుగు ఏళ్ళ పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు టీపీసీసీ పదవి వచ్చింది .లేకపోతే ఆయనకు ఆ పదవి వచ్చేదా ..టీఆర్ఎస్ పార్టీ పై అవాకులు చవాకులు పేలుస్తున్నారు .వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసు .
ఉత్తమ్ కుమార్ కు చెబుతున్న ఈ రోజు సాయంత్రం 7.గం.లకు నేను ప్రగతి భవన్లో ఉంటా. నువ్వు మీడియాను తీసుకోని రా ప్రగతిభవన్లో 15కి మించి గదులున్నాయని నిరూపిస్తే రాత్రి 8.గం.లకు గవర్నర్ దగ్గరకెళ్ళి సీఎం పదవికి రాజీనామా చేస్తా..వంద/150 గదులు లేకపోతే నీ ముక్కును ప్రగతిభవన్ ముందు నేలకు రాస్తావా అని సవాలు విసిరారు …