ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,వైసీపీ పార్టీ ఆవిర్భావినించిన తర్వాత మొట్ట మొదటిసారిగా విజయనగరం జిల్లాలో మద్దతు తెలిపిన నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరారు .అసలు విషయానికి వస్తే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు.
టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ నాయుడు సమక్షంలో పార్వతీపురం వేదికగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు .ఈ సందర్భంగా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .చంద్రశేఖర్ రాజ్ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మావయ్య కావడం విశేషం ..