తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో రేపు శుక్రవారం జరగనున్న టీఆర్ ఎస్ పార్టీ పదిహేడోప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు.
కింది భాగంలో ఎగురుతున్న టీఆర్ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, హోదా ఉంటాయి. నమోదు సమయంలో వీటిని అందిస్తారు. పార్టీ ప్రతినిధులకు అందించే పాస్‌లను గులాబీ రంగులో ముద్రించారు. వీవీఐపీ పాస్‌లను ఆకుపచ్చ రంగులో, ఎన్నారైలకు ముదురు గోధుమరంగులో, వీఐపీలకు కాషాయ రంగులో, మీడియా ప్రతినిధుల కోసం నీలంరంగులో, సాంస్కృతిక బృం దానికి పసుపు కాషాయం రంగులో పాస్‌లను, వలంటీర్ల కోసం నాలుగరకాల పాస్‌లను ముద్రించారు.