Home / POLITICS / తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీన‌రీ..!!

తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీన‌రీ..!!

డెబ్బై సంవ‌త్స‌రాల ఆంధ్రోళ్ల పాల‌న‌లో చేయ‌ని అభివృద్ధి, అమ‌లుకాని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను గ‌డిచిన నాలుగేళ్ల‌లో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు చేసి, ఇంకా చేస్తున్నార‌న్న‌ది తెలంగాణ ప్ర‌జ‌ల మాట‌. ఈ మాట‌ల‌కే అద్దంప‌ట్టేలా ఈ నెల 27వ తేదీన భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కొంప‌ల్లిలో టీఆర్ఎస్ ప్లీన‌రీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే, కొంప‌ల్లి వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీఆర్ఎస్ ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి .. ప్ర‌గ‌తి.. గా నామ‌క‌ర‌ణం చేసిన విష‌యం తెలిసిందే.

మరో ప‌క్క సీఎం కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌జా సంక్షేమం కోసం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతుబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేసీఆర్ కిట్.. ఇలా ప్ర‌జ‌ల‌ను అన్ని విధాల ఆదుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల విజ‌యాన్ని తెలిపేలా ఏర్పాటు చేసిన తోర‌ణాలు మంత్రి స్థాయి నుంచి.. సామాన్య టీఆర్ఎస్ కార్య‌క‌ర్త వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రికీ స‌గ‌ర్వంగా స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. మ‌రో ప‌క్క తెలంగాణ‌లోని ప్ర‌తీ కుటుంబం నుంచి టీఆర్ఎస్ ప్లీన‌రీలో పాల్గొనేందుకు ఒక్కొక్క‌రుగా ఇప్ప‌టికే బ‌య‌ల్దేరుతుండ‌టం గ‌మ‌నార్హం.

అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ప్లీనరీ ఎన్నికలు ముందు జరుగుతుండటంతో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 10గంటల నుండి సాయత్రం 5గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీ లో భోజనాలు కూడా హైలెట్ కాబోతున్నాయి. మన తెలంగాణకు సంబంధించిన 27 రకాల భారీ మెనూతో టీఆర్ఎస్ ప్లీన‌రీ రెడీ అయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat