జగన్‌లో ఉన్నది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శక్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్రమంగా బనాయించిన కేసులను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించినా.. ఎక్కడా లొంగని వ్యక్తిత్వం జగన్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం తనకు ఏ ఆపద చేపట్టినా తనకు అండగా నిలవాలంటూ వేడుకుంటున్నారు. అసలు ఏ తప్పూ చేయకపోతే.. తమపై చర్యలు తీసుకుంటారనే భయం టీడీపీ నేతల్లో ఎందుకు భయం కనిపిస్తుందనేది ఏపీ ప్రజల ప్రశ్న. తన తండ్రి మరణించిన సమయంలో తన తండ్రి మరణించిన సమయంలో.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు నల్లకాల్వ సాక్షిగా ఇచ్చిన మాట కోసం జగన్ ఎక్కడా రాజీ పడలేదు.
నాడు సోనియా గాంధీ సర్వ శక్తివంతురాలు.. ఓదార్పు యాత్ర అవసరం లేదు.. బాధితులందరినీ ఒకేచోటకు చేర్చి వారికి సాయం చేయాలని జగన్‌కు సూచించారు సోనియా గాంధీ. అయినా జగన్ నో చెప్పారు. తాను ఇచ్చిన మాట కోసం పార్టీని విడుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా జగన్‌పై కేసులు.. విచారణలు.. జైలు. అయినా జగన్ ప్రజలనే నమ్ముకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు. ఫలితంగా కడప ఉప ఎన్నికలో 5 లక్షలా 45వేల మెజార్టీతో విజయం. తనపై కక్ష సాధింపు చర్యలు మొదలవుతున్నాయనే సమాచారం ఉన్నా.. ఎప్పుడూ అందోళన చెందలేదు వైఎస్ జగన్. అన్నిటికి సిద్ధమన్నట్టుగా.. ముఖంపై చిరునవ్వుతో ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు.
అక్కడ్నుంచి నేటి వరకు ప్రత్యేక హోదాకోసం సోనియా గాంధీ తరువాత శక్తివంతమైన నాయకుడుగా పేరొందిన ప్రధాని మోడీనే ఢీకొన్నాడు జగన్. ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం ఏకంగా కేంద్రంలోని మోడీ సర్కార్‌పై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాణం పెట్టారు. ఆ వెంటనే టీడీపీ అధినేతకు చరిత్ర గుర్తుకు వచ్చింది. వైసీపీ అవిశ్వాసం పెట్టిన తరువాత.. తాము కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నామంటూ చంద్రబాబు ముందుకు వచ్చారు.
ఇక్కడ ప్రతీ ఒక్కరు గమనించాల్సింది ఒక్కటే.. సీఎం చంద్రబాబు ఏ సభ పెట్టినా మోడీ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు సరే.. అదే సమయంలోనే.. చంద్రబాబు మాటల్లో ఆందోళన భయం కనిపిస్తున్నాయి. త్వరలో నన్ను కేంద్ర ప్రభుత్వం జైలులో వేస్తుందని, ఈ మాటనే చంద్రబాబు పదే.. పదే అంటున్నారు. కేంద్రం నుంచి తనకు సమస్యలు వస్తాయని పదే.. పదే పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి ఏ ఆపద వచ్చినా నా చుట్టూ ఉండాలి అంటూ . ప్రజలను చంద్రబాబు అభ్యర్ధిస్తున్నారు.
ఇదే జగన్‌కు.. చంద్రబాబుకు మధ్యన ఉన్న నాయకత్వ లక్షణాలకు, తెగువ గురించి చర్చించుకోవడానికి కారణమైంది. ప్రతీ చోటా లాలూచీ రాజకీయాలు, మద్దతు మీడియాతో నెట్టుకొస్తున్న టీడీపీ జగన్లాగా దేనినైనా.. నేరుగా ఎదుర్కొనే శక్తి మాత్రం లేదనే విషయం స్పష్టమవుతోంది. జగన్‌లో ఉన్న తెగువ.. చంద్రబాబులో లేదనే విషయం మరో సారి స్పష్టమైంది. అందుకనే వైఎస్ జగన్‌కు స్టార్ హీరోకంటే ఎక్కువగా ప్రజలను ఆదరిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.