బెంగళూరు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన కేఎస్ఆర్టీసీ బస్సు ‘ఐరావతం’ మంటల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు బయలుదేరిన గంటలోగానే నగర శివార్లలోని దేవనహళ్లి వద్ద ఇంజిన్లో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో సిబ్బందితోపాటు బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. వారంతా వేగంగా వాహనం దిగడంతో ముప్పుతప్పింది. అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. వాహనం పాక్షికంగా దెబ్బతింది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ వాహనంలో హైదరాబాద్కు పంపారు.
