ఏపీ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి ,కాపు సామాజిక వర్గ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఇటివల ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోవాలని ముహూర్తం నిర్ణయించిన సంగతి తెల్సిందే .అయితే ఆ తర్వాత ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో పార్టీలో చేరిక కాస్త ఆలస్యమైంది .అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరుతున్నారో అనే అంశం మీద అడపా శివనాగేంద్ర క్లారిటీ ఇచ్చారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా అనుకున్నట్లు కన్నా లక్ష్మీ నారాయణ బుధవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సి ఉంది.
అయితే అనారోగ్యానికి గురికావడంతో అది కుదరలేదు .కానీ కన్నా లక్ష్మీ నారాయణ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన
తనయుడు ,మాజీ మేయర్ కన్నా నాగరాజు ,మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు ,బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్లా వెంకటేష్ యాదవ్ ,చదలవాడ వేణు బాబు ,బీజేపీ నగర యువమోర్చా అధ్యక్షుడు శిఖాకొల్లి అభినేష్ ,నగర ప్రధాన కార్యదర్శి కొల్లి సుబ్బారెడ్డి,బీసీ మోర్చా నగర అధ్యక్షుడు రాచమంటి భాస్కరరావు, పరుచూరి సంజయ్, తాడిశెట్టి రఘు, మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు అని ఆయన తెలిపారు .అంతే కాకుండా జగన్ తో మాట్లాడి ఒక రోజు ఫిక్స్ చేసి వెయ్యి కార్లతో ర్యాలీగా వెళ్లి తమ సత్తా చాటుతూ వైసీపీలో చేరతాము అని ఆయన మీడియాకు తెలిపారు ..