ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేంద్ర మంత్రి,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామదాస్ అత్వాలే ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బలమైన దమ్మున్న రాజకీయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు .అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి అందరికి మంచివాడిగానే కన్పించాడు.
ఎప్పుడు అయితే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్రను చేపట్టడంతో ఎక్కడ తమకు పోటీ వస్తాడో అని కుట్రలు చేశారు. ఈ కుట్రలను చూసి జరిగిన అవమానానికి వ్యతిరేకంగా పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించారు .అప్పటి యూపీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా మోసపూరితంగా పెట్టిన కేసులు చెల్లవు .అయన కడిగిన ముత్యం లా అన్ని కేసుల నుండి బయటపడతారు అని ఆయన అన్నారు ..