ఏపీలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారు. అడ్డపడిన వారిని దారుణంగా మహిళలు అని చూడకుండ వారిపై దాడి చేస్తున్నారు. తాజాగా అధికారం అండగా ఉందని టీడీపీ నేతలు శ్మశానవాటికను సైతం వదల కుండా కబ్జా చేశారు. వాళ్లు నిర్మిస్తున్న అపార్టుమెంట్ కోసం శ్మశానవాటిక గుండా రోడ్డు వేస్తున్నారు’ అంటూ గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన కిషోర్‌బాబు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని వి.ఎన్.పురం కాలనీలో జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. గన్నవరం ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు కేసరపల్లిలో నిర్మిస్తున్న అపార్టుమెంట్ కోసం హిందూ శ్మశానవాటికను కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని, దీనికి మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అండదండలు ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా గతంలో పేదలకు పంపిణీ చేసిన నివేశన స్థలాలను సైతం లాక్కునేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీకి చెందిన నేతలు కావటంతో రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోయారు.
