ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం .చంద్రబాబు మీద విరుచుకుపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము అయిన ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ నేతల పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు.
అవి చినిగితే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అంటూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు .మీ పార్టీకి చెందిన పోస్టర్లను మీ వాహనాలపై వేసుకోండి.ఇలాంటి భౌతిక దాడులను ఆపకపోతే ఆయుధాలతో సిద్ధంగా ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
టీడీపీ నేతల దగ్గర అక్రమంగా దోచుకున్న సోమ్ముంటే మా దగ్గర ప్రజాబలం ఉందని ఆయన అన్నారు .కులాల మధ్య గొడవలు పెట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు .వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తాం ..తమ సామాజిక వర్గానికి చెందినవారిని రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక కుటుంబ సభ్యులపై దాడులు చేయిస్తున్నారు ..మీ పతనం దగ్గరలోనే ఉంది అని ఆయన హెచ్చరించాడు ..