Home / ANDHRAPRADESH / కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత

కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి హైబీపీ రావడంతో హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కన్నాకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, మంగళవారం కన్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. . ప్రస్తుతం కన్నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్తతకు గురైన కన్నా లక్ష్మీనారాయణకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. నిన్న బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు జగన్ పార్టీలో చేరాల్సి ఉంది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో తన అనుచరులతో కలసి వచ్చి కన్నా వైసీపీలో నేడు చేరాలనుకున్నారు. కాని కన్నా అస్వస్థతకు గురి కావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat