అప్పటి ఉమ్మడి ఏపీలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ..దాదాపు తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు బుధవారం వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే .
అందుకు ఆయన ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను కూడా ఆయన ఆ పార్టీ జాతీయ
అధిష్టానానికి పంపించారు.ఈ తరుణంలోనే ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆయన చేరిక కాస్త ఆలస్యమైంది .కానీ కన్నా లక్ష్మీ నారాయణ అనుచవర్గంగా ఉన్న కాంగ్రెస్ బ్లాక్ కమిటీ చైర్మన్ కర్లా సైదరావు ,అతని అనుచరులు దాదాపు రెండు వందలమంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలోవైసీపీ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ఆయన తెలిపారు ..