ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్రలు పన్ని మరి అక్రమకేసులు బనాయించిన సంగతి విదితమే.అయితే గతనాలుగు ఏండ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులను న్యాయస్థానాలు క్రమక్రమంగా కొట్టేస్తున్నాయి.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలోనే పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు.
తాజాగా ఆయన నోటుకు ఓటు కేసు వ్యవహారంలో కూడా స్టే తెచ్చుకున్నారు.అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి బీజేపీ వరకు ..గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు ప్రధాన కారణమైన జనసేన నుండి ప్రజాసంఘాల వరకు అందరూ ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే టీడీపీ గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడింది కేంద్ర నిఘా సంఘాలు రిపోర్ట్స్ కూడా పీఎంఓకి పంపించాయి అని సమాచారం .
అందుకే ఐబీ చీఫ్ ఇటివల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలిశారు .కలిసిన తర్వాత బాబు అండ్ తెలుగు తమ్ముళ్ళ స్వరంలో తేడా వచ్చింది.ఏకంగా తెలుగు తమ్ముళ్ళు అయితే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీను ఓడించాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు అయితే కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తరవాత తనపై కేసులు పెడతారు .మీరంతా నాకు అండగా ఉండాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.అయితే తప్పు చేసినవాడు ఎలా ఉంటాడో..తప్పు చేయని వాడు ఎలా ఉంటాడో అంటూ జగన్ ,చంద్రబాబును ఉదాహరణగా చూపిస్తూ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు ఒక లుక్ వేయండి ..