ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-11 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-11లో భాగమైంది ఓ తెలుగమ్మాయి. మొదట న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ఆరంభించి అటుపై యాంకర్‌గా మారి ఇపుడు ఐపీఎల్ లో హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు హైదరాబాద్ వాసి వింధ్య విశాఖ. ప్రోకబడ్డీకి వచ్చిన విశేష స్పందనతో ఐపీఎల్ 11లో కూడా తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టింది స్టార్ సంస్థ. 20 మంది యాంకర్లతో పోటీపడి వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకుంది వింధ్య. ప్రస్తుత ఐపీఎల్-11లో 30 మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా చేయనుంది వింధ్య. ఘట్‌కేసర్‌కు చెందిన మేడపాటి మమతా, సత్తిరెడ్డి దంపతుల కుమార్తె వింధ్య. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్ అనంతరం పలు న్యూస్, మ్యూజిక్ ఛానల్‌లలో పనిచేశారు.
