Home / ANDHRAPRADESH / అచ్ఛం.. అమ్మ ఒడిలో ఉన్న‌ట్టే..!!

అచ్ఛం.. అమ్మ ఒడిలో ఉన్న‌ట్టే..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జాదార‌ణతో విజ‌య‌వంతంగా నిరంత‌రాయంగా కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల‌ ప్ర‌జ‌ల‌తో మ‌మేకమై, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. వృద్ధులు అయితే, త‌మ‌కు పింఛ‌న్ అంద‌క రోజుకు క‌నీసం ఒక్క పూటైనా తినేందుకు తిండి లేకుంద‌ని, నిరుద్యోగులైతే.. చంద్ర‌బాబు స‌ర్కార్ ఇంకా ఒక్క నోటిఫికేష‌న్ కూడా వ‌ద‌ల్లేద‌ని, డ్వాక్రా సంఘాలు, రైతులు అయితే, చంద్ర‌బాబు అధికారంలోకి బ్యాంకుల్లో తీసుకున్న రుణాల‌ను మాఫీ చేస్తాన‌ని చెప్పి.. చివ‌ర‌కు మాకంద‌రికీ కుచ్చుటోపీ పెట్టాడ‌ని జ‌గ‌న్ ముందు వారి వారి స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెడుతున్నారు.

అయితే, మంగ‌ళ‌వారం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 144వ రోజు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం గోప‌వ‌ర‌పు గూడెంలో విజ‌య‌వంతంగా కొన‌సాగింది. అందులో భాగంగా ఓ బాలింత త‌న బిడ్డ‌ను ఎత్తుకుని జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతున్న ప్రాంతానికి ప‌రుగు.. ప‌రుగున వ‌చ్చింది. అన్నా జ‌గ‌న‌న్నా.. అంటూ పిల‌వ‌సాగింది. ఆ బాలింత పిలుపుకు.. ఒడిలోని పాప ఏడుపు లంకించుకుంది. వెంట‌నే గ‌మ‌నించిన జ‌గ‌న్.. ఆ బాలింత చ‌తుల్లోని చిన్నారిని.. త‌న ఒడిలోకి తీసుకున్నారు. జ‌గ‌న్ ఇలా త‌న చేతుల‌తో ఆ పాప‌ను త‌న ఒడిలోకి తీసుకున్నాడో లేదో.. ఒక్క‌సారిగా ఆ పాప త‌న ఏడుపును ఆపేసింది. దీంతో అక్క‌డి ఉన్న వారంతా.. అచ్చం అమ్మ ఒడిలోలానే.. జ‌గ‌న్ ఓడిలో కూడా ఆ చిన్నారి ఒదిగి పోయిందంటూ ఆశ్చ‌ర్య‌కితుల‌య్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat