తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజమైంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్లగడ్డ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు చంద్రబాబు
నాయుడు .ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.అదేమిటి తన తండ్రి దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ,తల్లి దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డికి అత్యంత ముఖ్యమైన అనుచరుడుగా ..ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుడిగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డిపై మంత్రి కాగానే అఖిల ప్రియ కక్ష సాధింపు చర్యలకు దిగారు .
అందులో భాగంగా ఏవీ సుబ్బారెడ్డిను ,అతని అనుచరువర్గాన్ని ,తనకు మద్దతిచ్చే వారిని అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా ఏకంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆళ్లగడ్డ లో రాళ్ల దాడి చేయించారు మంత్రి అఖిల ప్రియ .దీంతో ఎప్పటి నుండో వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదాలను తీర్చాలని ..పరిస్థితులను చక్కదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలోచించి ఈ రోజు బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతికి ఇరువురును రమ్మని ఆదేశాలను జారీచేశాడు.
అయితే ఏవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత అందులో ముఖ్యమంత్రి పిలవడంతో హాజరయ్యారు .అయితే మంత్రి అఖిల ప్రియ మాత్రం బాబు చెబితే వినలా ..తనకు ఎటువంటి ఆహ్వానం లేదని ఆమె అమరావతికి వెళ్ళకుండా తన నియోజకవర్గంలో ఎటువంటి అధికారక కార్యక్రమాలు లేకపోయినా కానీ ఉండిపోయారు .దీంతో విసిగిచెందిన తెలుగు తమ్ముళ్ళు బాబు పిలిచి మరి మంత్రి పదవిస్తే ఇప్పుడే బాబుకే ఎదురుతిరిగి తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజం చేసిందని వాపోతున్నారు ..అయిన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం మరి ..