ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల (రెండు శాతం)మెజారిటీతో గెలుపొంది అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన టీడీపీ గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు
అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరక ప్రజాసోమ్మును దోచుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి మిగతా రాజకీయ పక్షాల వరకు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.
ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షంగా కల్సి బరిలోకి దిగి నాలుగు యేండ్ల పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంలో కల్సి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదు .
అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలే వారి పతనాన్ని తీసుకొస్తాయి.గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఏ ఒక్క హమీను కూడా నెరవేర్చలేదు.ఇప్పటికే ఈ పార్టీలో ఉంటె తమ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని ఆలోచిస్తున్న పలువురు టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు.వచ్చే నెల మే15 నుండి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఇతర నేతలు వైసీపీలో చేరతారు అని ఆయన వ్యాఖ్యానించారు ..