విజయనగరంలో అంగన్వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అదికారంలో టీడీపీ ప్రభుత్వం ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్ చేశారు. కాగా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిన్న (సోమవారం) కదంతొక్కారు. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అంగన్వాడీ వర్కర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren't you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana?
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2018