ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రజాపోరాటాలతో వైసీపీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఖచ్చితంగా 150 పైగా సీట్లు గెలవలాని అంచనా వేస్తున్నారు ఇటీవల జరిపిన అధికార, ప్రతిపక్ష పార్టీల పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని తెలుస్తోంది.
ఇందులో బాగంగానే పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోగా, ఆయన దారిలో కావూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా పయనించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని పక్క సమచారం అందగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడాల్సివుంది. ఈలోగానే అంటే 27వ తేదీన జగన్ సమక్షంలో మరో నేత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే.