ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పి.. తీరా అధికారం చేపట్టాక ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అని అంటూ తన కుఠిల రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించారు.
ఇదిలా ఉండగా.. నాడు రాష్ట్ర విభజన సమయం నుంచి.. నేటి వరకు ప్రత్యేక హోదా అనే అంశం ఇంకా ప్రజల నోట్లో నానుతుందంటే అందుకు కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పుకోక తప్పదు. అధికారంలో లేకపోయినా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ.. అటు కేంద్ర ప్రభుత్వంతోనూ పోట్లాడుతూ ప్రత్యేక హోదా అనే అంశంపై పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్‌సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించుందుకు కూడా వెనుకాడలేదు. మార్చి6వ తేదీ లోపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంపై నిర్ణయం తీసుకోకుంటే వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్ నాడు సమైక్యాంద్ర పోరాటంలోనూ .. నేడు ప్రత్యేక హోదాపై ఒకే మాటమీద నిలబడటం చూస్తున్న ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కు మద్దతును తెలుపుతున్నారు.