టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ సాక్షాత్తు దేశ ప్రజలు దేవాలయంగా భావించే పార్లమెంటులో ఉందా ..ఇప్పటికే కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ వర్గాలను ఒక ఊపు ఊపుతున్న క్యాస్టింగ్ కౌచ్ మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఈ అంశం మీద ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుక చౌదరిస్పందించారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోట ఉంటుంది.అందుకు పార్లమెంటు కూడా మినహాయింపు కాదు అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు .అయితే ఇదే అంశం గురించిబాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ స్పందించారు.ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు .
ఈ వ్యవహారం దేశంలో ఎక్కడ లేదా ..ఏమి మీ మీడియాలో లేదంటూ జర్నలిస్టులను ప్రశ్నించారు.అక్కడితో ఆగకుండా
సినిమా రంగంలో క్యాస్టింగ్ కోచ్ మాములే ..దానివలన కొంతమందికి ఉపాధి దొరుకుతుంది.తిండి దొరుకుతుంది.ఇండస్ట్రీలో ఎవరు రేప్ లు చేసి వదిలిపెట్టరు ..వారికీ ఉపాధిని చూపిస్తారు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే ..