జనసేన అధినేత పవన్ కళ్యాణ మరి బాంబ్ పేల్చారు.గత కొన్ని రోజుల నుండి తనపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల అధినేతలపై యుద్ధం ప్రకటించి..వరుస ట్వీ ట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు,సీఈవో రవిప్రకాష్ పై విరుచుకుపడి..ఆ తర్వాత కొద్ది కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు.
గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పోలీసులను అభ్యర్థించనున్నట్టు పవన్ ట్వీట్ చేశారు.ఈ దెబ్బతో తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు, మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వైపు దారి తీస్తుందంటూ ట్వీట్ చేశారు.
I am contemplating to request TS police for an investigation into the 6 month slander campaign. I am for sure all the names of these characters both men & women who came out to malign me will be eventually lead to Amaravati..
— Pawan Kalyan (@PawanKalyan) April 24, 2018
దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు, రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు.. అందరూ బయటకు వస్తారని… సమాజంలోని కుళ్లు కూడా బయట పడుతుందన్నారు.‘‘మీరందరూ కలిసి నడి రోడ్డుపై ఓ సోదరి బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని ‘షో’లకు అది కారణమైంది’’ అని పవన్ ట్వీట్ చేశారు.
Lot of interesting names from reputed families, politicians,media barons, their kids..will come out. The ugly Nakedness of our society will come out.if you all could encourage to strip a ‘ sister’ & made a show then this will be mother of all shows.
— Pawan Kalyan (@PawanKalyan) April 24, 2018