ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఇటివల ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా దాదాపు పదమూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టి అలుపు ఎరగని పోరాటం చేసి ..చివరికి కేంద్ర సర్కారు దిగిరాకపోతే తమ ఎంపీ పదవులకు వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.
తమ రాజీనామా పత్రాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు స్వయంగా అందించి ఏపీలో అడుగుపెట్టారు.ఈ క్రమంలో ఎంపీ మేకపాటి మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా టీడీపీ బీజేపీ పార్టీలు కల్సి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు.ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా గత నాలుగు ఏండ్లుగా అలుపు ఎరగని పోరాటం చేస్తున్న తమ పార్టీ రానున్న కాలంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తుంది.
తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించి తీరుతాం .తద్వారా రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ..కాకపోతే తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి అండగా ఉంటాను అని ఆయన తెలిపారు.అంటే రానున్న ఎన్నికల్లో ఎంపీగా రాజమోహనరెడ్డి బరిలోకి దిగను అని పరోక్షంగా చెప్పారు అన్నమాట ..