తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో నెంబర్ వన్ స్థానంలో వుందని అన్నారు.డిండి ప్రాజెక్ట్ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నీళ్ళు ఇచ్చామని తెలిపారు.రాష్ట్రంలో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.రాష్ట్రంలో సాగు చేసే ప్రతి రైతన్నకు ఎకరాకు 8 వేల పెట్టుబడి చొప్పున పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.
రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.దేశంలోనే వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఅరె అని అన్నారు.24గంటల కరెంట్ తో వ్యవసాయం లో అద్బుత అవిష్కృతమైందని పేర్కొన్నారు. త్వరలోనే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు సాగు నీరు అందిస్తామని చెప్పారు.