ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా చంద్రబాబు మీద నిరూపించలేకపోయిందన్నారు. అసలు చంద్రబాబును విమర్శించే అర్హత మీకెక్కడ ఉంది అంటూ జగన్మోహన్రెడ్డిపై ఫైరయ్యారు.
2014 ఎన్నికల తరువాత మీ కుటుంబాన్ని ఓడించాలని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని, 2014 ఎన్నికల్లో విజయమ్మను ఓడించాం.. అలాగే 2019 ఎన్నికల్లో నిన్నూ, నీ చెల్లిని ఓడిస్తామంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు మంత్రి అచ్చెన్నాయుడు. అంతేగాక, భూమన కరుణాకర్‌రెడ్డి, కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వీరంతా డేరా బాబా ఆశ్రమంలో శిక్షణ పొందిన వారేనంటూ వ్యగ్యాస్ర్తాలు సంధించారు.