ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలబై నాలుగు మంది (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి విదితమే )ఎమ్మెల్యేలు పార్టీ అధినేత వైఎస్
జగన్మోహన్ రెడ్డితో సహా తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి .
అయితే ఈ వార్తలపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది .ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు అని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వంతు పాడే పచ్చ మీడియా విషప్రచారం చేస్తుంది.
అయితే తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయమనిచేబితే అదే చేస్తాం ..ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంత దూరమైనా వెళ్తాం అని ఆయన ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు .