Home / POLITICS / తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌శంస‌ల జ‌ల్లు

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌శంస‌ల జ‌ల్లు

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇందుకోసం అనేక వినూత్న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలా మ‌న స‌ర్కారు చేస్తున్న ప‌నిని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియంలను మంత్రి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పోరాడి తెలంగాణ సాధించుకున్నామ‌ని, సాధించిన తెలంగాణలో అభివృద్ధిని కూడా అదే పోరాట ఉద్యమ స్ఫూర్తి తో చేసుకుంటున్నామ‌న్నారు. నాటి ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టమ‌ని పేర్కొన్నారు. గతానికి పూర్తి భిన్నంగా, రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ రూపు రేఖలు మార్చేశామ‌ని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలోని బస్తీల్లో వెయ్యి బస్తీ దవాఖానాలు పెడుతున్నామ‌ని, వైద్యపరంగా గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పరుస్తున్నామ‌ని వివ‌రించారు. కేంద్ర నిధులు వీలైనంత రావడానికి ప్రయత్నిస్తున్నామ‌ని, ఎయిమ్స్ ని రాష్ట్రానికి తేగలిగామ‌ని పేర్కొంటూ 6 నెలల్లో ఎయిమ్స్ ప్రారంభం కావడానికి ప్రయత్నిస్తున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్ గారి ప్రయత్నాలు ఫలించాయి. ఇందుకు సహకరించిన కేంద్రానికి కృతజ్ఞతలని మంత్రి తెలిపారు.

బీజేపీకి చెందిన మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఫీవర్ హాస్పిటల్ లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ‌ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాన‌ని తెలిపారు. ఫీవర్ హాస్పిటల్ చాలా పురాతనమైన దవాఖానా అని పేర్కొంటూ దీన్ని అభివృద్ధి చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ 5 కోట్ల రూపాయల తో భవనాలు నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు ఈఎన్‌టీ ఆస్ప‌త్రికి గొంతు నొప్పితో వెళ్లగా వైద్యులు బాగా చూసారని ప్ర‌శంసించారు. వైద్య విభాగం బాగా పని చేస్తోంద‌ని వైద్యులు, మంత్రి లక్ష్మారెడ్డి ని అభినందిస్తున్నానని వెల్ల‌డించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat