Home / ANDHRAPRADESH / ఏపీలో సంచలనం..వైఎస్ జగన్ ను కలవనున్నా..బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

ఏపీలో సంచలనం..వైఎస్ జగన్ ను కలవనున్నా..బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

గత 144 రోజులుగా ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండలోనే వేలది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ పాదయాత్రకు విశేశ స్పందన వస్తుంది. అక్కడ అక్కడ టీడీపీ,బీజేపీ ,కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వలసలు భారీగా జరిగాయి. ఇందులో బాగంగానే తాజాగ వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రను త్వరలోనే వైఎస్ జగన్ ని బీజేపీ ఏపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కలవబోతున్నట్టుగా ప్రకటించారు .

విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను అభినందించారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్ ధైర్యసాహసాలు అభినందనీయం అని ఈ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఐదారు కిలోమీటర్ల దూరం నడవాలంటేనే చాలా మంది హడలిపోతారని, రెండు మూడు రోజులు అలా నడిస్తే మంచం పడతారని, అయితే జగన్ మాత్రం అలుపెరగకుండా వేల కిలోమీటర్ల దూరం నడుస్తుండటం గొప్ప అని విష్ణుకుమార్ రాజు అభినందించారు. జగన్‌కు తమ ఇంట్లో కూడా అభిమానులున్నారని, తన మామ జగన్ ను ఇష్టపడతారని.. జగన్ ను కలవాలని తనను అడిగారని రాజు వివరించారు. ఆయనను తీసుకుని జగన్ వద్దకు వెళ్తామని, జగన్ పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు తాము కలుస్తామని రాజు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి అదే విషయం చెప్పారు ఈ బీజేపీ నేత. పాదయాత్రలో భాగంగా జగన్ విశాఖకు వచ్చినప్పుడు తన మామను జగన్ వద్దకు తీసుకెళ్తాను అని ఆయన అన్నారు. ఇంతకు మించిన ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీలోకి చేరతారు అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat