ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు .అసలు విషయానికి ఆ పార్టీ చైర్ పర్శన్ రత్నమాలతో సహా పదహారు మంది కౌన్సిలర్లు తమ పదవులకు ,పార్టీకి రాజీనామా చేసిన వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే సహకారంతో పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండటంతో తీవ్ర అసహనానికి గురైన వీళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు అని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు .
అయితే నియోజకవర్గంలో ఒక పర్టికలర్ విభాగంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుంటుంటే సంబంధిత డీఈకి వాటాలు అందుతున్నాయి అని తెలుసుకున్న రత్నమాల అతన్ని వెంటనే బదిలీ చేయాలనీ డిమాండ్ చేశారు.అయితే నియోజకవర్గంలో పెద్ద స్థాయి నేతలు చెప్పడంతో అధికారులు సదరు డీఈని బదిలీ చేయకుండా మరల అదే పోస్టింగ్ లో ఉంచారు.
దీంతో తీవ్రమైన అసంతృప్తికి లోనైనా రత్నమాల వర్గం తమ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా పార్టీకి కూడా రాజీనామా చేశారు.అయితే ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందినా పలువురు వైసీపీ పార్టీలోకి వెళ్ళుతున్న తరుణంలో ఇలా వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుందని ఇటు తమ్ముళ్ళతో పాటుగా అటు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు …