కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లోని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వ్యక్తిగత కక్షలు టీడీపీ పార్టీపై ప్రభావం చూపుతున్నాయని ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ టీడీపీఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. ఎవరు చేప్పిన ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలోటీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. .ఈ ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలీవలే సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నఏవీ సుబ్బారెడ్డిపై కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. మంత్రి అఖిలప్రియ వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారురు.ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనతో వీరిద్దరిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అమరావతికి రావాలని సూచించారు. తాజాగా ఈ ఇద్దరు నేతల తీరుపై టీడీపీ ఆళ్ళగడ్డ మాజీ ఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీనేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చోటు చేసుకొన్న వివాదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టారని రాంపుల్లారెడ్డి మంత్రితో పాటు సుబ్బారెడ్డిపై విమర్శలు గుప్పించారు. పార్టీకి నష్టం కల్గిస్తున్నారు ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిలు పరస్పరం గొడవలు పెట్టుకోవడం, పోటాపోటీ ర్యాలీలు, దీక్షలు చేయడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఆళ్ళగడ్డ టీడీపీమాజీ ఇంఛార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు.