ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి (ఈరోజు)సోమవారం ఉదయం వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జటన్ తో పాగు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగానే వైఎస్ జగన్ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్ మీదుగా గోపవరపు గూడెంకు చేరుకుంటారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బసచేస్తారు.
