ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తుండటం చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. జగన్‌తోపాటు, వైసీపీ నాయకురాలు రోజా మాట్లాడుతున్న మాటలు.. మహిళా లోకాన్ని తలదించుకునేలా ఉన్నాయన్నారు.
పదహారు నెలలు జైల్లో ఉండి.. పదుల సంఖ్యలో ఛార్జిషీట్లు వెంటపెట్టుకు తిరుగుతున్న నీవు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తావా..? అంటూ ప్రశ్నించారు. లక్షల కోట్ల ప్రజా సొమ్మును తిన్న అవినీతి పరుడు జగన్.. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ప్రజా నాయుడు చంద్రబాబు అంటూ.. జగన్, చంద్రబాబుల మధ్య పోలిక చెప్పింది ఎమ్మెల్యే అనిత. 2019 ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే భయంతోనే వైఎస్ జగన్ ఇప్పటి నుంచే పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవ చేశారు.