సహజంగా కుట్రలు ఎదో ఒక రోజు బయటపడతాయని అంటారు. అన్ని విషయాలలో కాకపోయినా, కొన్ని విషయాలలో ఇది వాస్తవమేనని వెల్లడవుతోంది.శ్రీరెడ్డి అనే నటి వివాదం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లిందో చూడండి.ఇదంతా ఎంత గేమ్ ప్లాన్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారుతుందా అన్న ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనలు తెలపడం అన్నది సినిమా రంగానికి సంబందించిన అంశం. ఆమెకు ప్రాదాన్యత ఇవ్వడం,ఇవ్వకపోవడం అన్నది టీవీ చానళ్లు, పత్రికలకు సంబందించిన విషయం.అయితే మొత్తం ఆపరేషన్ అంతా ఎపి సచివాలయం కేంద్రంగా జరిగిందన్న సమాచారం రావడం సంచలనమే.అది కూడా జనసేన అదినేత, సినీ రంగంలో కీలకమైన ప్రముఖ స్థానంలో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నుంచి బహిర్గతం అయిందంటే అందులో వాస్తవం ఉండి తీరాలి.తెలుగుదేశం ప్రబుత్వం అవినీతిపై , మంత్రి లోకేష్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ పై టిడిపి ఏదో రూపంలో దాడి చేస్తుందని అంతా ఊహించారు.కాని ఇంత నీచంగా చేస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి ఉదంతంలో వ్యాఖ్యలు చేయించడం, అందులో రామ్ గోపాల్ వర్మ చేయి ఉండడం, కోట్ల రూపాయల లావాదేవీల భాగోతం మొదలైనవి అన్నీ వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు..ఆ బురదను తెలుగుదేశం మీడియా తెలివిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అంటింటి, పవన్ కళ్యాణ్, జగన్ ల మద్య ఘర్షణ జరిగేలా చేయాలని కూడా ప్రయత్నించారు.అందుకు వారు చేయని ప్రయత్నం లేదు.సరిగ్గా చంద్రబాబు దీక్ష ఆరంభించే సమయానికి పవన్ కళ్యాణ్ బాంబుల వంటి అంశాలను వదలి తీవ్ర సంచలనం సృష్టించారు. పవన్ కళ్యాణ్ ను ఒకందుకు అబినందించాలి. చంద్రబాబు ఆద్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుట్రలకు పాల్పడగలదో ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. కొన్ని టివీ చానళ్ల గురించి ,పది కోట్ల డీల్ గురించి వెల్లడి చేసి చంద్రబాబు నిజ స్వరూపాన్ని బహిర్గతం చేశారనుకోవాలి.
ఇంతకాలం విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై ఎన్నో కుట్రలు జరిగాయి.వాటిని ఆయన ఎదుర్కుంటూ ముందుకు సాగుతున్నారు.అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం నాయకత్వం కోవర్టులను పెట్టి ఆయనను బదనాం చేసిందని చాలామంది చెబుతుంటారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అయిన తర్వాత ఆయనను కూడా అలాగే దెబ్బతీయాలని అనుకున్నట్లు కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికైతే గట్టిగానే తిప్పికొట్టడమే కాకుండా, ప్రజలలో చంద్రబాబు ప్రభుత్వం అనండి, టిడిపి అనండి చేస్తున్న అకృత్యాలను ఎండగట్టగలుగుతున్నారు. ఇంతకాలం ఇవే విషయాలను జగన్ చెబుతుంటే తెలుగుదేశం పార్టీ ఆయనపై ఎదురుదాడిచేస్తూ ప్రతిపక్షం కనుక అలా మాట్లాడుతున్నట్లు ఆరోపించి తప్పించుకునేది.ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా చేసిన ఈ ఆరోపణలకు చంద్రబాబు సమాదానం ఇవ్వగలుగుతారా?ఎపి సచివాలయం కేంద్రంగా లోకేష్, కొందరు మీడియా ప్రముఖులు కలిసి శ్రీరెడ్డి ఉదంతంలో రాజకీయం చొప్పించారన్న ఆరోపణకు ఏమని సమాధానం ఇస్తారు.సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్ వచ్చిందనో,ఇంకొకటనో చెప్పి వలంటీర్లను అరెస్టు చేసే ప్రభుత్వం ఇప్పుడు ఎవరిని అరెస్టు చేసింది. ఇలాంటి కుట్రలపై విచారణ చేయగలుగుతుందా?పవన్ అన్నట్లు ఒక వృద్దురాలైన ఆయన తల్లిని అవమానించేలా బూతులు మాట్లాడుతుంటే తెలుగుదేశం మీడియా చానళ్లు వాటిని అనుమతించడం ఏమిటి? రేటింగ్ ల దశ దాటి ఇదంతా రాజకీయ కుట్ర దశకు మారడం అంటే వచ్చే ఎన్నికలలో జగన్ కాని, పవన్ కళ్యాణ్ కాని ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్దం చేసుకోవచ్చు.
ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడినా,ఆయనపై చర్య తీసుకునే ధైర్యం ఎవరికి ఉండదు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగల శక్తి ఆయనకు ఉన్నట్లుగా మరెవరికి లేదని అంతా నమ్ముతారు. అందువల్ల ఆయన ఎన్ని కుట్రలు పన్నినా ఇంతకాలం జరిగిపోయింది.ఇక్కడ ఒక మాట చెప్పాలి. 1994 లో ఎన్.టి.రామారావు అదికారంలోకి వచ్చాక, మంత్రిగా ఉంటూ చంద్రబాబు కాని ఆయన బృందం కాని ఎన్.టి.ఆర్.పై ఎన్ని రకాల అభాండాలను ప్రచారం చేసేవారో అప్పట్లో ఆయా విషయాలను పరిశీలిస్తుండేవారందరికి తెలుసు.సొంత మామ అయిన ఎన్.టి.ఆర్ పైనే అలా చేసినప్పుడు మిగిలినవారు ఒక లెక్క కాదు.
అయితే ఎల్లకాలం ఒకే విదంగా సాగదు.కొన్నిసార్లు అయినా పరిస్తితులు ఎదురు తిరుగుతాయనడానికి ఇటీవలి పరిణామాలే నిదర్శనం. గతంలో ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి కుట్ర రాజకీయాలు,నీచ రాజకీయాలు తక్కువే అని చెప్పాలి.విధానాలు, అంశాల మీద రాజకీయాలు సాగేవి .చంద్రబాబు మాత్రం వ్యక్తుల ఆదారంగా వారిని వ్యక్తిగతంగా డామేజీ చేసి తను బాగుపడాలని వ్యూహ రచన చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యారు. కాని ఇప్పుడు ఆయనే ఆ వ్యూహంలో చిక్కుకుని గిలగిలలాడుతున్నారు.ఇలాంటి కుట్ర రాజకీయాలను చూసి ప్రజలు చంద్రబాబును అనండి..తెలుగుదేశం పార్టీని అనండి..అసహ్యించుకునే పరిస్తితి తెచ్చుకున్నారు.చంద్రబాబుకు తోడుగా ఆయన కుమారుడు లోకేష్ కూడా అదే బాట పట్టారు. అదికారపు యావలో ఇలాంటి దౌర్బాగ్యపు రాజకీయాలు సాగడం దురదృష్టకరం.సోర్సు :కొమ్మినేని