ఆయన ప్రపంచ క్రికెట్ లోకానికి దేవుడు ..క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఇండియన్స్ ఆయన్ని క్రికెట్ దేవుడుగా కొలుస్తారు ..వన్డే మ్యాచ్ ల్లో నలబై తొమ్మిది శతకాలు ..టెస్ట్ మ్యాచ్ ల్లో యాబై ఒక్క శతకాలతో మొత్తం క్రికెట్ ప్రపంచంలో వంద శతకాలు బాడిన పరుగుల వీరుడు ..క్రికెటే ప్రాణంగా బ్రతికి తన కెరీర్ అంతా క్రికెట్ జీవితమే కొనసాగాడు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం
ఎవరి గురించి అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు ఓన్లీ వన్ అండ్ మ్యాన్ సచిన్ టెండూల్కర్ .సచిన్ టెండూల్కర్ స్పర్శ తాకి ఒక దివ్యాంగుడు తను కూర్చొన్న కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు .నమ్మరా అయితే మీరే ఒక లుక్ వేయండి ..
ఈ రోజు సోమవారం ముంబై లో జరిగిన ఒక పుస్తావిష్కరణ కార్యక్రమానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిధిగా
హాజరయ్యారు .ఈ సందర్భంగా మజుందార్ మాట్లాడుతూ ఇది కొన్నాళ్ళ కిందట జరిగిన నిజమైన అరుదైన సంఘటన .అది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లోని ఓ చిన్నపిల్లల ట్రస్ట్ ఆస్పత్రి .అక్కడ చాలా మంది దివ్యాంగులైన పిల్లలున్నారు .వీరిలో ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు వీరాభిమాని .ఆతని వయస్సు పదకొండు ఏళ్ళు ఉంటుంది .వీరందరికీ లేచి నిలబడటం చేతకాదు .అక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు .
సచిన్ ను చూస్తూ ఆ వీరాభిమాని అలాగేఉండిపోయాడు.సచిన్ నేరుగా అతడి దగ్గరకు వెళ్లి చేతిలో బ్యాట్ పెట్టాడు .అంతే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు ఆ పిల్లాడు గతంలో ఎన్నడు లేని విధంగా లేచి నిలబడ్డాడు .మూడు బంతులు ఆడాడు కూడా .దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు .అద్భుతం జరిగిందని అందరూ చప్పట్లు కొట్టారు .అయితే తనపై వీరాభిమనం పెంచుకున్న ఒక దివ్యంగుడు తన స్పర్శ తాకి పైకి లేచి మరి నిలబడటం చాలా సంతోషం అనిపించిందని సచిన్ అప్పుడే అన్నారు .అందుకే అంటారు ఒక వ్యక్తిపై పెంచుకున్న అమితమైన ప్రేమ వలన ఆ స్పర్శకు ఉండే మహత్తు ఎలాంటిదో ..దాని వలన కలిగే అద్భుతం ఏమిటో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు అంటూ ఆయన వివరించారు ..