రియల్‌గా జగన్ ఏం చెప్పాడో.. రీల్‌లో అదే చూపిచ్చిన సూపర్‌స్టార్ మహేష్..!! ఈ మధ్య సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇద్దరూ కూడా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సపోర్టు చేస్తున్నారన్న విషయం బయటకు కనిపించకపోయినా ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున, కృష్ణ ఇద్దరు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. పైగా ఒకానొక సమయంలో కృష్ణా రాజశేఖర్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాడు కూడా. ఈ సంఘటలు చూస్తుంటే ఈ వార్త నిజమే అనిపించక మానదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా రిలీజైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పేలిన అన్ని డైలాగ్స్ కూడా జగన్‌కు చాలా దగ్గరగా ఉన్నాయని, ఇది భరత్ అనే నేను కాదని, జగన్ అనే నేను అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇక ఆ వార్త సారాంశం ప్రకారం, చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది ప్రామిస్ చేసి మాట తప్పితే యు ఆర్ నాట్ ఏ గోల్డ్ మెన్, ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మరిచి పోలేదు. భరత్ అనే సినిమాలో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్స్ ఇవి.
ఇప్పుడు ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకునే రాశారని, ఆయన్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారని, నెటిజన్స్ కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. జగన్ మోహన్‌రెడ్డి కూడా రాజకీయాల్లో మాట ఇస్తే తప్పడని, వెనకడుగు వేయడని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఈ చిత్రంలో ఒక్కసారి ప్రామిస్ చేసి మాట తప్పితే యు ఆర్ నాట్ ఏ గోల్డ్ మెన్ అని మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ జగన్ జీవితానికి దగ్గరగా ఉందంటున్నారు ఆయన అభిమానులు.
అలాగే.. విశ్వసనీయత, చిత్తశుద్ధి తప్పనిసరిగా ఉండాలని వైఎస్ జగన్ తాను నిర్వహించిన ప్రతి సభలోనూ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. వీ ఆర్ లివింగ్ ఇన్ సొసైటీ, ప్రతీ ఒక్కరికి భయం బాధ్యత ఉండాలి అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ జగన్ మాటలకు దగ్గరగా ఉందనేది వారి వాదన.
అంతేకాకుండా, జగన్ మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ కూడా పలు సందర్భాల్లో వైఎస్ జగన్ మాట ఇస్తే.. తప్పడు అని చెప్పిన డైలాగ్‌లు జగన్ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు.
ఇవే కాక సినిమాలో జగన్‌కు సంబంధించి మహేష్ చెప్పిన మరో డైలాగ్ కూడా ఉంది. నా జీవితంలో అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. అది పెద్దదే కాదు, కష్టమైంది కూడా. కానీ ఎంత కష్టమైనా ఆ మాట తప్పలేదు. బికాజ్ ఐ యాయ్ ఏ కామన్ మెన్. అన్న ఈ డైలాగ్‌ను జగన్‌కు పోల్చుకుంటున్నారు ఆయన అభిమానులు. ఎలా అంటే. ప్రత్యేక హోదా సాధన జగన్‌కు అతి పెద్ద సవాల్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ఇచ్చిన హామీని ఎంత కష్టమైనా, ఎంత పెద్దదైనా.. ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత జగన్‌పై ఉందంటున్నారు.
ఇక వీటికి బలం చేకూర్చేలా ప్రత్యేక హోదా మనకు ఎందుకు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు కనిపించదా..? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి మనిషిలా మారండి అంటూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
అలాగే, ఏపీ రాజకీయాల్లో సీఎం రేసులో ఉన్న యంగ్ హ్యాండ్సమ్, అండ్ డైనమిక్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్ మోహన్‌రెడ్డే. మహేష్ బాబు కూడా భరత్ అనే నేను చిత్రంలో యంగ్ హ్యాండ్సమ్, అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా కనిపించారు.
ఇక డ్రస్సింగ్ విషయంలో కూడా వైఎస్ జగన్, సూపర్ స్టార్ మహేష్‌బాబు మధ్య చాలా దగ్గరి పోలికలే ఉన్నాయి. కాబట్టి ఇది భరత్ అనే నేను కాదని, జగన్ అనే నేను అంటున్నారు ఆయన అభిమానులు.
అంశం పిల్లలు చదువులు సమస్య పూర్తి వీడియో చూడండి భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పిన మాటలు జగన్ అన్న మాటలు వినండి అందరికీ షర్ చెయండి.
Posted by Naginani Venkata Ramana Royal on Sunday, 22 April 2018