జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.గత కొన్ని రోజుల నుండి వరుస ట్వీట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పవన్ ..ఇవాళ సంచలన ప్రకటన చేశారు.“త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది”. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది. అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో
” మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?? ” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.అలాగే ఇవాళ సాయంత్రంలోపు చిత్తూరు జిల్లాలో తన మూడు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తానని తెలిపారు.
అనంతరం మరో ట్వీట్ లో
తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . పబ్లిక్‌లో నోటికొచ్చినట్లు తిట్టి … ప్రైవేట్‌గా క్షమాపణలు చెబుతున్నారు. ఇలాంటివి తన దగ్గర కుదరవని…. గత ఆరు నెలలుగా తన తల్లిని, అభిమానులు, అనుచరుల్ని నోటికొచ్చినట్లు తిట్టారు. ఇంతటి నీచ బుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.