తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 27 న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ స్థలాన్ని ,ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని..ఈ ప్లీనరీ నిర్వహణ కోసం 9 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది.ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని అన్నారు.ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. నాణ్యమైన రాష్ట్ర వంటకాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.