Home / POLITICS / కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌బోయి…కామెడీ పాల‌యిన కాంగ్రెస్‌

కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌బోయి…కామెడీ పాల‌యిన కాంగ్రెస్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేయాల‌నుకున్న ప్ర‌తిసారి..ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన కాంగ్రెస్ పార్టీ న‌వ్వుల పాల‌వుతోంద‌నే చ‌ర్చ వినిపిస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు అంటూ చేస్తున్న ప‌ని సొంతంగా వారినే బుక్ చేస్తోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 25వ తేదీన నాగం జనార్ధన్ రెడ్డి  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అయితే నాగం రాక‌కు ముందే…ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఇద్దరు ముఖ్యనేతలు జైపాల్‌రెడ్డి, డీకే అరుణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ఆమె నాగం రాక‌పై భ‌గ్గుమంటున్నారు.

పార్టీలోకి నాగం రాకను డీకే వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మరో ముగ్గురు నేతలతో ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి జైపాల్‌రెడ్డిపై.. డీకే అరుణ ఫిర్యాదు చేసినట్టు స‌మాచారం. టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో జైపాల్‌రెడ్డి కీలకపాత్ర వహించారని, అదే రీతిలో ఇప్పుడు బీజేపీలో ఉన్న నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ వర్గం ఆరోపిస్తున్నారు. నాగం ను పార్టీలోకి తీసుకుంటే ఇన్ని రోజులు పార్టీ కోసం క‌ష్టప‌డి ప‌నిచేసిన క్యాడ‌రంతా అధికార పార్టీ వైపు వెళ్ళే అవ‌కాశముందని ఆమె చెప్పారు.

మ‌రోవైపు ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి సైతం నాగంపై ఇటీవ‌ల మీడియాతో స్పందిస్తూ మండిప‌డ్డారు. నాగం క్యాడర్ లేని లీడర్ అని, ఆయ‌న్ను ఎన్నిక‌ల్లో నిలబడితే ఓటమి ఖాయమ‌ని ఎద్దేవా చేశారు.  నాగం ఎంపీగా పోటీ చేసి…తన కొడుకును ఎమ్మెల్యేగా నిలబడితేపెడితే డిపాజిట్ రాలేదని వ్యాఖ్యానించారు.  నాగంను కాంగ్రెస్ లోకి తెస్తే తాము ఎట్టి పరిస్థితిలోనూ సహకరించమ‌ని తేల్చిచెప్పారు. త‌న‌తో స‌హా ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి నాగం ను తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలను రాహుల్ గాంధీకి వివరించామని ప్ర‌క‌టించారు. నాగం, జైపాల్ రెడ్డికి మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని…జైపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేయ‌కూడ‌ద‌ని భావిస్తే..నాగంను కాంగ్రెస్ లోకి తేవాలనే లెక్క‌ల్లో భాగంగానే ఈ చేరిక అని ఆరోపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat