2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఈనెల 29 వ తేదీన గుడివాడలో ఉదయం 11 గంటలకు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు దాదాపుగా ఖరారు అయ్యింది.
గత వారంలోనే పాణ్యం డోన్ రోడ్డులోని వీజేఆర్ కన్వెన్షన్‌లో పాణ్యం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో ఆయన సమావేశమై జిల్లాలో 90 శాతం మంది నాయకులు వైసీపీలో చేరాలని కాటసానికి సూచించారు. అంతేగాక కాటసాని రాంభూపాల్‌రెడ్డి .. తన రాజకీయ భవిష్యత్ కోసం కార్యకర్తలు, అనుచరులు చూపుతున్న అభిమానం, ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంతో రాజకీయ సమీకరణాలు మారాయని..దాంతో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో టీడీపీ ,కాంగ్రెస్,ఇతర పార్టీ నేతలు చేరడంతో వైసీపీకి పెరుగుతుంది మరింత బలం అని చెప్పవచ్చు.