స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం, ధర్మసాగర్ మండలం, దేవనూర్ గ్రామానికి చెందిన పీరాల నర్సయ్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురైన ఆయన భార్య, కూతురు చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తానని, కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటానని ఉప ముఖ్యమంత్రి కడియం హామీ ఇచ్చారు. నర్సయ్య తనతో పాటు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. నర్సయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు.
