Home / ANDHRAPRADESH / సీఎం చంద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ వార్నింగ్‌..!!

సీఎం చంద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ వార్నింగ్‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. చ‌ద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం వెనుక చాలా సీరియ‌స్ ప‌రిణామాలే చోటుచేసుకోబోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే, ఆదివారం నాడు సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల కాలంలో అటు ప‌త్రిక‌ల‌తోపాటు.. సోష‌ల్ మీడియాలో భారీ అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అంతేకాకుండా, విప‌క్షాలు ఆధారాల‌తో స‌హా చంద్ర‌బాబు స‌ర్కార్ పాల్ప‌డుతున్న అవినీతిని ఎండ‌గ‌ట్ట‌డాన్ని ప్ర‌శ్నించారు.

పోల‌వ‌రం, పోటుకు నోటు, ప‌ట్టిసీమ‌, అమ‌రావ‌తి నిర్మాణం, ఇసుక అక్ర‌మ ర‌వాణా, రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌పై అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేస్తున్న దాడులు, టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సామాన్యుల‌పై ఒక గూండాల్లా, రైడీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై చంద్ర‌బాబును గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శ్నించారు. టీడీపీ నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ఏపీలోని సామాన్యుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నా మీరు మౌనంగా ఉన్నారంటే మీ అస‌మ‌ర్ధ‌త ఏంటో తేట‌తెల్ల‌మ‌వుతోంద‌ని చంద్ర‌బాబు వ‌ద్దే గ‌వ‌ర్న‌ర్ వ్యంగ్యంగా అన్నారు. ఈ విష‌యాన్ని ఈనాడు దిన‌ప‌త్రిక వెల్ల‌డించింది. అంతేకాకుండా, ఇటీవ‌ల కాలంలో సీఎం చంద్ర‌బాబు ద‌క్షిణ భార‌త దేశం, ఉత్త‌ర భార‌త‌దేశ‌మంటూ తాను నిర్వ‌హించిన ప్ర‌తీ స‌భ‌లోను ఊద‌ర‌గొడుతున్నార‌ని ఆ ప‌త్రిక రాసుకొచ్చింది.

అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌కు మోడీ స‌ర్కార్ రూ.25వేల కోట్లు ఇచ్చింద‌ని స‌భ‌ల్లో చెప్పే సీఎం చంద్ర‌బాబు.. ఇన్నాళ్లు కేంద్ర ప్ర‌భుత్వంలో పాట్న‌ర్‌గా ఉన్న చంద్ర‌బాబు ఏపీకి ఏం సాధించార‌ని, అయితే, కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్టుకుంటున్న ఇత‌ర రాష్ట్రాల ను చూసి.. మాకు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టాల్సిన చంద్ర‌బాబు.. ప‌క్క‌నోడికీ ఇవ్వొద్దు.. నాకూ ఇవ్వొద్దు అన్న చందాన మాట్లాడ‌టం 40 ఏళ్ల అనుభ‌వ‌మంటూ చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకు త‌గ‌ద‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది. అలాగే, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప‌నులు, నిదులు, టెండ‌ర్ల విష‌యంలో తేడా వ‌చ్చింద‌ని ఆ ప‌త్రిక స్ప‌ష్టం చేసింది.

అంతేకాకుండా, ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన ఒక్క రోజు నిరాహార దీక్ష‌లో హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీపై బూతుల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిలో కూరుకుపోయి ఉంటే.. అది చాల‌క ప్ర‌ధాని మోడీపై బూతుల వ‌ర్షం కురిపించ‌డాన్ని గ‌మ‌నించిన కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎన్‌క్వైరీ వేసేందుకు రంగం సిద్ధం చేశార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహన్ ఆదివారం చంద్ర‌బాబును క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై పూస‌గుచ్చిన‌ట్లు చెప్పార‌ని, ఇక‌నైనా జాగ్ర‌త్త‌గా కేంద్ర ప్ర‌భుత్వంతో మెల‌గాల‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చంద్ర‌బాబుకు సూచించిన‌ట్లు ఆ ప‌త్రిక పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat