ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హోదా లో ఉండి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసే రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే
పించన్లు తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాల ద్వారా లబ్ది పొందుతారు.
కానీ నాకు ఓట్లు వేయరా అని విమర్శించిన సంగతి తెల్సిందే .తాజాగా ఆయన మాట్లాడుతూ తను ఇస్తున్న నీళ్ళను త్రాగి తనపైనే విమర్శలు చేస్తారా ..అని పోలవరంలో జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు . ఆయన ఇంకా మాట్లాడుతూ తన నియోజకవర్గం కుప్పం కంటే పులివెందులకే ముందుగా నీళ్లు ఇచ్చామని, అయితే తాను ఇచ్చిన నీళ్లను తాగుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
సాక్షి పత్రిక మీద కూడా విమర్శలు చేశారు. కాగా ప్రదాని మోడీ తనకంటే జూనియర్ అని ,ప్రత్యేక హోదా కోసం ఇంతకాలం వేచి ఉన్నామని, ఇప్పుడు దండోపాయంలోకి వచ్చామని ఆయన అన్నారు.ప్రదాని మోడీ వెంకన్నకు బదులు ఇవ్వాలని ఆయన
అన్నారు.