తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సారి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీ ,వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు బిగ్ షాకిస్తూ గతంలో విసిరిన సవాలును రీపీట్ చేశారు.
గతంలో వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోను అని శపదం చేసిన సంగతి తెల్సిందే.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఉన్నతాధికారులు ,కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్యక్రమం గురించి గతంలో తానూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను .
రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ వంతున పనులు జరిగితే డిసెంబర్ నాటికే పనులు పూర్తై నాలుగు నెలలకు ముందే ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు .అలా చేయకపోతే ఓట్లే అడగను అని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు ..