నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని మంత్రి అఖిలప్రియ సంచలన వాఖ్యలు చేశారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్వయంగా ప్రధాని మోదీ ఏపీని మోసం చేశారని అన్నారు. ఆనాడు ఏపీని విభజించవద్దని ఏవిధంగా రోడ్డుమీదకు ఎక్కి నిరసన తెలిపామో…ఇప్పుడు కేంద్రం వైఖరికి నిరసనగా రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలపాల్సి వస్తోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. రుద్రవరం మండలం మత్తులూరు, నర్సాపురంలో సైకిల్ యాత్ర చేసిన అఖిలప్రియ పలు చోట్ల మాట్లాడారు. మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓ వైపు మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పోటాపోటీగా సైకియాత్రలు చేపట్టారు. రుద్రవరం మండలంలో మంత్రి అఖిలప్రియ, కోటకందుకూరులో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌యాత్ర చేస్తున్నారు. నిన్నటి ఘటన తరుణంలో రెండు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
