తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల్లో సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోలేపల్లి గ్రామంలో నిర్మించిన 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాలును ప్రారంభించారు దానవాయి గూడెం డివిజన్లో ఇరవై అయిదు లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రామన్నపేటలో మరో ఇరవై అయిదు లక్షలతో సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..పాలేరు నియోజకవర్గ పరిధిలో 50 ఎస్సీ కమ్యూనిటీ హల్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు వాళ్ళ కథాలోకే నగదు జమ చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు లేకున్నా కొనుగోలు చేసి ఇండ్లు నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు.